God Father: చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` ఫస్ట్ లుక్ నెవర్ బిఫోర్‌.. సంబరాల్లో ఫ్యాన్స్.. లెక్క సరిచేస్తాడా?

Published : Jul 04, 2022, 06:17 PM IST
God Father: చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` ఫస్ట్ లుక్ నెవర్ బిఫోర్‌.. సంబరాల్లో ఫ్యాన్స్.. లెక్క సరిచేస్తాడా?

సారాంశం

గతంలో ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి `గాడ్‌ఫాదర్‌` లుక్‌ సరికొత్తగా, ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఇది ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. 

మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులకు గూస్‌బంమ్స్ ట్రీట్‌ ఇచ్చారు. తాను ప్రస్తుతం నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి లుక్‌ అదిరిపోయేలా ఉండటం విశేషం. సరికొత్త లుక్‌లో చిరు నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉన్నారు. తలపై కాస్త నెరిసిన జుట్టు, పక్కకి చూస్తున్న ఇంటెన్స్ లుక్‌, చైర్‌లో దర్జాగా కూర్చున్న తీరు వాహ్‌ అనిపిస్తుంది. మెగాస్టార్‌ అభిమానులకు సరైన విజువల్‌ ట్రీట్‌లా ఉందని చెప్పొచ్చు. 

గతంలో ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి లుక్‌ సరికొత్తగా, ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఇది ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. `గాడ్‌ఫాదర్‌`.. రాజకీయాలను శాషించే తెరవెనుక రాజకీయాలను, మాఫియాని ప్రతిబింబించే చిత్రమిది. ఇందులో చిరంజీవి రాజకీయాలను తెరవెనుక నుంచి శాషించే మాఫియా నాయకుడిగా కనిపించబోతున్నారు. గాడ్‌ ఫాదర్‌ తరహా పాత్రని ఆయన పోషిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి `గాడ్‌ ఫాదర్‌` అనే టైటిల్‌ని నిర్ణయించారు. 

చిరంజీవి అనేక యాక్షన్‌ చిత్రాలు చేశారు, కమర్షియల్‌ మాస్‌ మసాలా మూవీస్‌ చేశారు. ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ సినిమాలు కూడా చేశారు. కానీ ఇలాంటి డార్క్ సైడ్‌ నేపథ్యంతో కూడిన చిత్రాలు చేయలేదు. `గాడ్‌ ఫాదర్‌`తో రాబోతున్నారు. తనలోని విభిన్న యాంగిల్స్ ని ఆవిష్కరించబోతున్నారు. పవర్‌ఫుల్‌ పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషించగా, పృథ్వీరాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు పోషించారు. 

దీన్ని తెలుగులో `గాడ్‌ ఫాదర్‌`గా రీమేక్‌ చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్‌, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార చిరుకి చెల్లిగా కనిపించనుంది. ఆయనకు ఫీమేల్‌ స్టార్‌ లేరు. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. నేడు సత్యదేవ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌తోపాటు ఇప్పుడు చిరంజీవి ఫస్ట్ లుక్‌ విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం చిరు ఫస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. 

చివరగా చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటించారు. అనేక అంచనాలతో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించగా, కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌లో నెలలో విడులైన ఈ సినిమా పరాజయం చెందింది. దీంతో సక్సెస్‌ కొట్టాలని కసీతో ఉన్నారు చిరు. ఈ నేపథ్యంలో `గాడ్‌ ఫాదర్‌`పై ప్రెజర్‌ పెరిగింది. మరి ఆయన లెక్క సరిచేస్తారా? లేదా? అనేది చూడాలి. ఈ సినిమాతో చిరంజీవి లెక్క సరి చేస్తారేమో చూడాలి.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా