Bimbisara Trailer : రాక్షసుడైనా, భగవంతుడైనా ‘బింబిసారుడు’ ఒక్కడే.. దుమ్ములేపిన కళ్యాణ్ రామ్.. ‌

By team teluguFirst Published Jul 4, 2022, 6:11 PM IST
Highlights

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ గా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. 
 

చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకునేందుకు ‘బింబిసార’ చిత్రంతో సిద్ధమవుతున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్  (Kalyan Ram). గతంలో ‘పటాస్’, ‘ఇజం’తో  మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ చివరిగా 118, ఎంత మంచివాడవురా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నటన పరంగా ఆడియెన్స్ ను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఫాంటసి యాక్షన్ ఫిల్మ్ Bimbisara చిత్రంలో నటిస్తున్నారు. చిత్రానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దాదాపు తుది దశ షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

తాజాగా  బింబిసార నుంచి అదిరిపోయే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్ అదిరిపోయింది. భారీ సెట్స్ లో అద్భుతమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు తన మార్క్ చూపిస్తాడని అనిపిస్తోంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్  తన కేరీర్ లోనే తొలిసారిగా మహాచక్రవర్తి పాత్రలో నటిస్తున్నారు. 5వ శతాబ్దం BCEలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ అద్భుతంగా నటించారు. అలాగే కాలయాత్ర ద్వారా కళ్యాణ్ ఆధునిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. బింబిసారుడు ఏం చేశాడు.. ఆధునిక కాలంలోకి రావాల్సిన అవసరం ఏముందనే సందేహాలు ట్రైలర్ చూస్తే కలుగుతున్నాయి.

బింబిసార ట్రైలర్ (Bimbisara) ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లోనూ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ దూసుకుపోతోంది. మూవీలో హీరోయిన్లుగా క్యాథరిన్ ట్రెసా  (Catherine Tresa), సంయుక్త మీనన్ నటించారు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించగా.. ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ ఏడాది ఆగస్టు 5న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

click me!