Prabhas: యాక్టింగ్ నేర్పిన గురువుకు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్, స్వయంగా అందజేసిన యంగ్ రెబల్ స్టార్

By Mahesh Jujjuri  |  First Published Dec 5, 2023, 8:37 AM IST

ఎవరు ఏస్థాయిలోఉన్నా.. వారు స్టార్ట్ అయిన పాయింట్ ను మర్చిపోకూడదు.. బేసిక్ ను గుర్తుంచుకోవాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా ఎదిగిన తారలు తము ఎక్కడ స్టార్ట్అయ్యాము అన్నది గుర్తుంచుకుంటారు..తమ ఎదుగుదలకు కారణం అయిన వారిని గుర్తుంచుకుంటారు. అప్పడప్పుడు తలుచుకుంటారు.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అదే పనిచేశారు. 
 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్. టాలీవుడ్ లో చిన్న సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. 150 కోట్ల రెమ్యూనరేషన్ లో  ఇండియా నెంబర్ వన్ స్టార్ గా మారాడు ప్రభాస్. ఇక ఆయన ఎంత ఎత్తు ఎదిగినా తన మూలాలను మాత్రం మర్చిపోలేదు. చదువు చెప్పిన గురువులను మర్చిపోలేదు. నటనలో ఓనమాలు నేర్పిన గురువునైతే గుండెల్లో పెట్టి పూజించుకుంటున్నాడు ప్రభాస్. తాజాగా తన నటగురువు సత్యానంద్ పుట్టినరోజుకు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్చపరచాడు ప్రభాస్. 

ప్రభాస్ కు నటన నేర్పిన గురువు సత్యానంద్. ప్రభాస్ కు మాత్రమే కాదు..చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న టాలీవుడ్ యంగ్స్ స్టార్స్ వరకూ టాలీవుడ్ లో ఎక్కువ మంది సత్యానంద్ శిష్యులే. ప్రభాస్ కూడా కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. సత్యానంద్ వద్ద నటనలో  శిక్షణ తీసుకొని ఈశ్వర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అయితే వారసత్వం పక్కన పెడితే.. తనసొంత టాలెంట్ తో ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్. 

Latest Videos

undefined

ఇలా నటనలో తనని తాను నిరూపించుకుంటూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని చెప్పాలి. ప్రభాస్ తనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి తన గురువు గారి పుట్టినరోజు కావడంతో ఈయన తన గురువు కోసం ఏకంగా పూర్తి బంగారంతో తయారు చేసిన  చేతి వాచ్ ను తనకు కానుకగా ఇచ్చారు.

బలగం వేణుకి బంపర్ ఆఫర్, నేచురల్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్న జబర్థస్త్ కమెడియన్

అంతే కాదు అంతటి స్టార్ హీరో.. ఎవరితోనో భహుమతి పంపించలేదు..  ప్రభాస్ స్వయంగా తన గురువు సత్యానంద్ ఇంటికి వెళ్లి.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తానే సత్యానంద్ చేతికి ఆ బంగారు వాచి తోడిగారు.  ఇక పుట్టినరోజు సందర్భంగా తనకు విలువైన కానుకను ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ వాచ్ మీకు నచ్చిందా గురువుగారు అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఈనెలలో రిలీజ్ కాబోతోంది సలార్. ఈక్రమంలో భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా మూడు పాన్ఇండియా సినిమాలు నిరాశపరచడంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

click me!