
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ... ఇటూ రిలీజ్ లోనూ అంతే స్పీడ్ చూపుతూ షాకిస్తున్నాడు. ఏకకాలంలో మూడు నుంచి నాలుగు చిత్రాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సినిమా పట్ల తనకున్న డెడికేషన్ ఎంటో చూపిస్తున్నాడు. అయితే ఇటీవలనే రొమాంటిక్ ఫిల్మ్ ‘సమ్మతమే’ తో అలరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఆడియెన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ను వదిలాడు. గ్యాప్ ఇవ్వకుండా సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు.
తాజాగా తను నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)తో సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఈ మూవీ నుంచి ‘వైబ్ ఆఫ్ వీబీవీకే’పేరుతో అదిరిపోయే గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్స్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమాలో ఏకంగా తిరుపతి వాసిగా కిరణ్ ‘విష్ణు’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. ఇదీగాక రేపు మరో #KA6 నుంచి మరో అదిరిపోయే అప్డేట్ రానుండటం విశేషం.
ఇలా కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’పై శ్రద్ధ వహించారు. VBVK చిత్రం నుంచి గ్లింప్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. జీఏ2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మార్తాండ కే వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.