
క్యూ హీరోయిన్, హాట్ హీరోయిన్ కలిసి సినిమా చేయబోతున్నారు. క్యూట్ అందాలతో కుర్రాళ్లని మెస్మరైజ్ చేసే అనుపమా పరమేశ్వరన్, హాట్ అందాలతో కనువిందు చేసే రెజీనా ప్రధాన పాత్రధారులుగా `మరీచిక` అనే సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రానికి సతీష్ కాశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. రాజీవ్ చిలక్కా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ని గురువారం విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న టైటిల్‌కి `కళ్లని కనికట్టు చేసే భ్రమ` అనే అర్థం వస్తుందని చెబుతుంది చిత్ర బృందం. పోస్టర్‌లో రెండు పాదాలు కనిపిస్తున్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడలాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో `ప్రేమ ద్రోహం ప్రతీకారం` క్యాప్షన్స్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా అని తెలుస్తుంది.
క్యూట్ హీరోయిన్ అనుపమా, హాట్ బ్యూటీ రెజీనా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికితోడు టైటిల్ పోస్టర్ సైతం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా గురించి యూనిట్ చెబుతూ, `ఇప్పటికే సినిమాఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, జులై 26 నుంచి రెండో షెడ్యూల్ చిత్రీకరించనున్నట్టు తెలిపారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఇలియరాజా సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కిస్తున్నాం. దీనికి ఇళయరాజా సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.
`వన్ మోర్ హీరో బ్యానర్‌పై రాజీవ్ చిలక్కా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలను అందించారు. దీంతో పాటు లక్ష్మీ భూపాల ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. 20 ఏళ్ల పాటు యానిమేషన్ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుని రాజీవ్ చిలక్కా `ఛోటా భీమ్`ను రూపొందించారు. ఇప్పుడు వన్ మోర్ హీరో అనే బ్యానర్‌ను ప్రారంభించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు` అని దర్శకుడు తెలిపారు.