సాహో కోసం నిద్రలేని రాత్రులు గడిపారట

By Prashanth MFirst Published Aug 27, 2019, 2:23 PM IST
Highlights

నాలుగేళ్లుగా సాహో సినిమా కోసం వందల మంది పడిన క్లాష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలు దర్శకుడు అలాగే ఇతర టెక్నీషియన్స్ తీరిక లేకుండా ఒకే సినిమా కోసం కష్టపడ్డారు. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో ఎన్నో మార్పులు చేసిన చిత్ర యూనిట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ని సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

అతనికి చాలా తక్కువ సమయం ఇచ్చినప్పటికీ ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి సాహో కు నేపథ్య సంగీతం అందించాడు. రీసెంట్ గా ఆ విషయాన్నీ జిబ్రాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే డైరెక్టర్ సుజిత్ విజన్ కి సెల్యూట్ అంటూ ఈ సినిమాకు వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నానని జిబ్రాన్ వివరణ ఇచ్చాడు. 

సినిమాకు జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెబుతూ వస్తోంది. మరి ఆ వర్క్ ఆడియెన్స్ కి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 30న తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

click me!