ఈ బయోపిక్ కి ఇబ్బందులు తప్పేలా లేవు?

Published : Oct 05, 2018, 09:47 PM IST
ఈ బయోపిక్ కి ఇబ్బందులు తప్పేలా లేవు?

సారాంశం

మహానటి అందించిన కలెక్షన్స్ బయోపిక్ లకు మంచి నమ్మకాన్ని కలిగించాయి. ఎమోషన్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేయగలిగితే ఆడియెన్స్ సినిమాకు ప్రమోషన్స్ తెచ్చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ -యాత్ర బయోపిక్ లపై అభిమానుల్లో అంచనాలు బాగానే పెరిగాయి. 

బయోపిక్ లు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఊపందుకున్నాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహానటి అందించిన కలెక్షన్స్ బయోపిక్ లకు మంచి నమ్మకాన్ని కలిగించాయి. ఎమోషన్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేయగలిగితే ఆడియెన్స్ సినిమాకు ప్రమోషన్స్ తెచ్చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ -యాత్ర బయోపిక్ లపై అభిమానుల్లో అంచనాలు బాగానే పెరిగాయి. 

ఆ సంగతి అటుంచితే.. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఘంటసాల బయోపిక్ ఇటీవల కొంచెం టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినిమాకు సంబందించిన నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. దర్శకుడు సిహెచ్ రామారావు షూటింగ్ ని మొదలుపెట్టి 80% షూటింగ్ ని కూడా సైలెంట్ గా పూర్తి చేశారు. ఘంటసాల పాత్రలో కృష్ణ చైతన్య. అతని భార్య మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో కనిపించనున్నారు. 

అంతా బాగానే ఉంది కానీ బయోపిక్ తెరకెక్కించే ముందు ఘంటసాల కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడంలో అశ్రద్ధ వహించారు.  కుటుంబ సబ్యులకు చిత్ర యూనిట్ సినిమా ఫినిష్ చేసి ఆ తరువాత వారిని కూల్ చెయ్యాలని అనుకున్నారు. అయితే రీసెంట్ గా సినిమా చూపించినప్పటికీ ఘంటసాల వారసులు ఒప్పుకోలేదు. 

కుమారుడు రత్నకుమార్ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. అనుమతి లేకుండా తీయడమే కాకుండా ఘటసాలను కించే పరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని అన్నారు. మరి చిత్ర యూనిట్  వారిని ఏ విధంగా ఒప్పిస్తారో చూడాలి.      

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు