
వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్ గ్రైండ్ తో తెరకెక్కిన సినిమా గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సార్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇక ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. క్యారెక్టర్ కు తగ్గట్టు తన బాడీని కంప్లీట్ గా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ తో రోమన్ శిల్పంలా తయారయ్యాడు వరుణ్. మూవీ చిత్రీకరణ, మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది యూనిట్. అయితే అన్నీ బాగానే ఉన్నా.. రిలీజ్ డేట్ పై ఆడియెన్స్ కు స్పష్టత లేకపోయింది. ఇందుకు ఫిబ్రవరి 25 పక్కాగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అప్డేట్ అందించారు.
ఇప్పటికే ఈ చిత్రం గతేడాది జూలై 30న విడుదల కావాల్సింది. కానీ దేశంలో COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఆగస్టులోనూ.. తర్వాత దీపావళి సందర్భంగా నవంబర్ లో విడుదల చేయానుకుంటూ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత గతేడాదే డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామన్న కుదరలేదు. ఆ నెలలోనే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నందున గని మేకర్స్ జాగ్రత్తగా పడ్డారు. ఇక భారీ బడ్జెట్ మూవీలు, మల్టీసారర్ మూవీలను గుర్తుంచుకొని, కరోనా పరిస్థితులను కూడా గమనించి చివరిగా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ రెండు రిలీజ్ డేట్లలో ఎప్పుడే చేస్తారనేదానిపై ఆడియెన్స్ స్పష్టతనివ్వలేదు. దీంతో గందరగోళంలో పడ్డ ఆడియెన్స్ కు క్లారిటీ ఇస్తూ తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ ‘గని’ (Ghani) మూవీని రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ఈ నెలలో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీ రిలీజైంది. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. అయితే ‘గని’ మూవీ మేకర్స్ బ్లాక్ చేసిన రోజునే శర్వానంద్ (Sharwanand) నటించిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ రెండు రిలీజ్ డేట్ల ను ప్రకటించింది. అందులో మొదటి రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25నే ఉంది. ఒకవేళ అదే రోజు భీమ్లా నాయక్ కూడా రిలీజ్ అయితే బాబయ్ తో వరుణ్ కు గట్టి పోటీ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.