సింగర్ ని కూడా దర్శక, నిర్మాతలు పిలుస్తారా అని చాలా బాధపడ్డా

Published : Apr 21, 2018, 06:10 PM IST
సింగర్ ని కూడా దర్శక, నిర్మాతలు పిలుస్తారా అని చాలా బాధపడ్డా

సారాంశం

సింగర్ ని కూడా దర్శక, నిర్మాతలు పిలుస్తారా అని ఆశ్యర్యపడ్డా

సింగర్ గా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న సింగర్ గీతామాధురి.  మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం. సింగర్ కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదు. మొదట్లో సినిమాల్లో పాటలు పాడకముందు నా స్నేహితులు ఇదంతా జరుగుతుందని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డా. నా టాలెంట్‌కు ఇప్పటితో పుల్‌స్టాప్ పడిపోతుందని అనుకున్నా. కానీ నన్ను అలా పిలిచిన దర్శకుల దగ్గరకు అస్సలు వెళ్ళలేదు. వారి గురించి ఆలోచించడం తగ్గించాం. మంచి వ్యక్తులు అవకాశాలు ఇస్తే సినిమాల్లో పాటలు పాడాలని నిర్ణయించుకున్నా. అనుకున్న విధంగానే నాకు మరికొంతమంది అండగా నిలిచారు.. అవకాశాలిచ్చారు. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో నేను గాయనిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వెళుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నానంటోంది గాయని గీతామాధురి.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌