మీకో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నా.. సీనియర్ హీరో పోస్ట్!

By Udayavani DhuliFirst Published Aug 14, 2018, 12:07 PM IST
Highlights

విక్టరీ వెంకటేష్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికీ నటుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజుకి ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికీ నటుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజుకి ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. తన సినీ ప్రయాణం గురించి చెబుతూ.. '1986 ఆగస్టు 14న నేను నటుడిగా జన్మించాను. నేను తొలిసారి నడిచిన 'కలియుగ పాండవులు' సినిమా విడుదలై ఈరోజు 32 ఏళ్లు అవుతుంది.

అప్పటినుండి మీ అందరి ప్రేమాభిమానాలను పొందుతున్నందుకు నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా నేను సినీ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నాను. దీని ద్వారా మీ అందరికిఈ మరింత దగ్గర కాబోతున్నాను. త్వరలోనే మీకో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను' అంటూ రాసుకొచ్చాడు వెంకీ.

ఇంతకీ ఆయన ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడిగా మీరు మరింత ఎదగాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న 'ఎఫ్2' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. తమన్నా.. వెంకటేష్ కు జోడీగా నటిస్తుండగా, మెహ్రీన్.. వరుణ్ కి జంటగా కనిపించనుంది. ఈ సినిమా తరువాత నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నారు.  

 

click me!