బిగ్ బాస్2: తనీష్, సునైనాలను బిగ్ బాస్ శిక్ష!

Published : Aug 14, 2018, 11:50 AM ISTUpdated : Sep 09, 2018, 01:01 PM IST
బిగ్ బాస్2: తనీష్, సునైనాలను బిగ్ బాస్ శిక్ష!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు హౌస్ నుండి వెళ్లబోతున్నారో  తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతోంది

బిగ్ బాస్ సీజన్ 2లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు హౌస్ నుండి వెళ్లబోతున్నారో  తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతోంది. దీప్తి సునైనా వెళ్లే ఛాన్స్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నా.. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ను బట్టి ఆమెకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియతో రసవత్తరంగా నడిచింది.

ఈరోజు ఎపిసోడ్ ఎలా వుండబోతుందనే ప్రోమోని విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. హౌస్ లో లైట్స్ ఆపిన తరువాతే పడుకోవాలి. ఆ రూల్ ని హౌస్ లో చాలా మంది అప్పుడప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీప్తి సునైనా గురించే.. అయితే ఈసారి తనీష్, దీప్తి సునైనా ఇద్దరూ పడుకొని ఉండడంతో బిగ్ బాస్ వారికొక శిక్ష వేశారు.

తనీష్, దీప్తి కలిసి బిగ్ బాస్ ఇచ్చిన విసన కర్రతో హౌస్ లో ఉన్న సభ్యులందరికీ విసురుతూనే ఉండాలి. బిగ్ బాస్ ఇచ్చే తదుపరి ఆదేశం వరకు వీరు గాలి విసరక తప్పదు. ఈ  శిక్షను మిగిలిన హౌస్ మేట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించారు.   

 

PREV
click me!

Recommended Stories

మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 సినిమాలు, మెగా సమ్మర్ కోసం అభిమానుల ఎదురుచూపులు..
34 ఏళ్ళ వయసులో బాహుబలి ఐటెం గర్ల్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. డ్యాన్స్ తోనే గుర్తింపు