'గీతగోవిందం' టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

Published : Aug 11, 2018, 05:15 PM ISTUpdated : Sep 09, 2018, 12:59 PM IST
'గీతగోవిందం' టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

సారాంశం

ఆగస్టు 15 సెలవు రోజు కాబట్టి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడితే నిర్మాతలు సేవ్ అవుతారనే విషయంలో రూ.15 కోట్లు అని సమాచారం. మేకింగ్ కోసం దాదాపు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం 'గీతగోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. పాటలు, పోస్టర్లతో టీమ్ తెగ హడావిడి చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది. యూత్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 సెలవు రోజు కాబట్టి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడితే నిర్మాతలు సేవ్ అవుతారనే విషయంలో రూ.15 కోట్లు అని సమాచారం. మేకింగ్ కోసం దాదాపు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడి వచ్చేసినా.. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో మరికొంత డబ్బు రావడం ఖాయం.

ఇప్పటికి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా వసూళ్లను సాధింస్తుని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలానే ఈ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా 'గీతగోవిందం' సినిమాకు కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?