ఆ బాండింగ్ ఏంటో మాకు తెలుసు: గీతామాధురి

Published : Oct 12, 2018, 11:44 AM IST
ఆ బాండింగ్ ఏంటో మాకు తెలుసు: గీతామాధురి

సారాంశం

గీత మాధురి - సామ్రాట్ కి సంబందించిన వార్తలు కొన్ని రోజుల వరకు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై గీత మాధురి కౌంటర్ ఇచ్చారు. 

బిగ్ బాస్ మొదటి సీజన్ మరియు సెకండ్ సీజన్ రెండు కూడా ఎదో విధంగా కాంట్రవర్షియల్ అయినప్పటికీ ఎక్కువగా సెకండ్ సీజన్ డోస్ పెరిగిందని చెప్పవచ్చు. హౌస్ లో పరిణామాలు వీక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఒక్క కౌశల్ ఆర్మీ తోనే సెకండ్ సీజన్ కి మరింత హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఆ సంగతి అటుంచితే ఇతర కంటెస్టెంట్స్ గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. 

గీత మాధురి - సామ్రాట్ కి సంబందించిన వార్తలు కొన్ని రోజుల వరకు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై గీత మాధురి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మనిషితో కళ్లల్లోకి చూడకుండా ముక్కు జుట్టు చూసి మాట్లాడతారా? గేమ్ లో నవ్వడం , మాట్లాడటం సాధారణం. అమిత్ బయ్యతో కూడా అలానే ఉన్నాను. 

అయితే కేవలం సామ్రాట్ విషయంలో మాత్రమే అలా అయ్యింది. దాన్ని తప్పుగా అనుకుంటే ఎలా?. అలా అయితే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ కి వెళ్లేవారిని ఎవరితో మాట్లాడకుండా ఉండాలని ముందే చెప్పాలి. నాకు నందు రిలేషన్ తప్ప వేరేదేదైనా ఒకటే. కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు కళ్లతో కూడా మాట్లాడుకోవచ్చని ముందే చెప్పా. ఫుడ్ షేర్ చేసుకున్నాం. ఆ బాండింగ్ ఏంటో మాకు తెలుసు. వివిధ రకాలుగా చుస్తే ఏం చెయ్యలేం. రాఖి కట్టమని సామ్రాట్ అడిగాడు. అందులో తప్పేముందని గీత మాధురి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర