షోలో ఉన్నట్లుగా బయట ఉండరు.. గీతామాధురి కామెంట్స్!

Published : Jul 05, 2019, 03:10 PM IST
షోలో ఉన్నట్లుగా బయట ఉండరు.. గీతామాధురి కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 1తో ఎంతో సరదాగా సాగిపోయింది. సీజన్ 2కి వచ్చేసరికి వివాదాలు ఎక్కువయ్యాయి. 

బిగ్ బాస్ సీజన్ 1తో ఎంతో సరదాగా సాగిపోయింది. సీజన్ 2కి వచ్చేసరికి వివాదాలు ఎక్కువయ్యాయి. కౌశల్ తో మిగిలిన ఇంటి సభ్యుల గొడవలు ఒకరిపై మరొకరు ద్వేషాలు పెంచుకునే వరకూ వెళ్లింది. త్వరలోనే సీజన్ 3 మొదలుకానుంది.

ఈ క్రమంలో సింగర్ గీతామాధురి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చాలా మంది షోకి సంబంధించిన విషయాలు అడుగుతున్నారని.. అలాంటి వారికి ఒకటే విషయం చెప్పదలచుకుంటున్నట్లు.. షోలో పోటీదారుల ప్రవర్తనను చూసి వారిని జడ్జ్ చేయకూడదని గీతామాధురి చెప్పింది.

షోలో గేమ్ స్ట్రాటజీలు ఉంటాయని.. షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతుంటుందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 2 షో ముగిసి ఏడాది కాలం గడిచిపోయిందని.. షోలో ఉన్నట్లుగా రియల్ లైఫ్ లో ఎవరూ కఠినంగా లేరని.. బయట అందరూ స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపింది.

బిగ్ బాస్ షోలో జరిగిన కొన్ని వివాదాస్పద విషయాలను పట్టుకొని లాగడం కరెక్ట్ కాదని.. అది కేవలం గేమ్ మాత్రమేనని.. షోలో కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నప్పటికీ అదంతా షో కోసం మాత్రమేనని.. షో నుండి బయటకి వచ్చిన తరువాత తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని వెల్లడించింది.

త్వరలోనే బిగ్ బాస్ 3 కూడా మొదలుకాబోతుందని.. ఇప్పుడు గొడవల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్