సోషల్ మీడియాలో 'గీతగోవిందం' సీన్లు.. షాక్ లో టీమ్!

Published : Aug 12, 2018, 11:37 AM ISTUpdated : Sep 09, 2018, 12:24 PM IST
సోషల్ మీడియాలో 'గీతగోవిందం' సీన్లు.. షాక్ లో టీమ్!

సారాంశం

కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ పనికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు సినిమాను షేర్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి లీకుల బెడద ఎక్కువైంది. నిన్నమొన్నటి వరకు పెద్ద సినిమాలకు మాత్రమే ఇలాంటి తిప్పలు ఉండేవి. ఇప్పుడు క్రేజ్ ఉన్న అన్ని సినిమాలకు ఈ సమస్య తప్పడం లేదు. తాజాగా 'గీతగోవిందం' సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా దర్శనమిచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.

అయితే రిలీజ్ కి ముందే సినిమాలో కొన్ని సీన్లను లీక్ అయ్యాయి. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ పనికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు సినిమాను షేర్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సినిమా టీమ్ కి చెందిన ఒక వ్యక్తి కొంత భాగాన్ని తన స్నేహితులకు ఫోన్ ద్వారా పంపించారు.

వారు మరికొంతమందికి పంపడం ఇలా ఆ సన్నివేశాలు ఆన్లైన్ లోకి వచ్చేశాయి. ఈ వీడియోలను షేర్ చేస్తున్న విద్యార్థులతో పాటు సన్నివేశాలు బయటకి రావడానికి కారణమైన అసలు వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నుండి ఆ సన్నివేశాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది