పందెం కోడి 3..మరో సీక్వెల్ కి కూడా సిద్ధం!

Published : Oct 24, 2018, 04:04 PM IST
పందెం కోడి 3..మరో సీక్వెల్ కి కూడా సిద్ధం!

సారాంశం

ఒక సినిమా హిట్టయితే ఈ రోజుల్లో సీక్వెల్స్ వస్తాయా అనే తరహాలో కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ సపోర్ట్ చేయాలి గాని ఎంతైనా సాగదీయవచ్చని హాలీవుడ్ లో ఎప్పుడో రుజువయ్యింది. ఇక మన సౌత్ లో కూడా గత కొంత కాలంగా సీక్వెల్స్ వరుసగా వస్తుండడం స్పెషల్ మూమెంట్ అని చెప్పాలి. 

అసలు విషయంలోల్కి వస్తే విశాల్ నటించిన పందెం కోడి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన ఆ కథను మళ్ళీ సాగదీశాడు దర్శకుడు లింగుస్వామి. పందెం కోడి 2కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ మీట్ ను నిర్వహించింది. 

అయితే పందెం కోడి 3కి కూడా తాము సిద్దమే అన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆల్ రెడీ దర్శకుడు మరో సీక్వెల్ కు కథను కూడా సిద్ధం చేసినట్లు విశాల్ తో చర్చలు జరిపినట్లు వివరణ ఇచ్చాడు. ఇక విశాల్ కూడా కథను ఇంకా కొనసాగించడానికి ఆసక్తి చూపుతామని చెప్పడంతో తప్పకుండా మరో పందెం కోడి రానుందని కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

PREV
click me!

Recommended Stories

Shruti Haasan: పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటా, మ్యారేజ్ పై తన డ్రీమ్ రివీల్ చేసిన శ్రుతి హాసన్
కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు