వెబ్ సీరిస్ లో రమ్యకృష్ణ.. డైరక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Published : Dec 21, 2018, 09:57 AM ISTUpdated : Dec 21, 2018, 10:02 AM IST
వెబ్ సీరిస్ లో రమ్యకృష్ణ.. డైరక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సారాంశం

ఇది వెబ్ సీరిస్ ల సీజన్. వరస పెట్టి వెబ్ సీరిస్ లు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వాటికి గ్లామర్ అద్దే కార్యక్రమం మొదలైంది. సినిమావాళ్లు సైతం వెబ్ సీరిస్ ల్లోకి రావటంతో స్టార్స్ ...వాటిల్లో నటిస్తున్నారు. 

ఇది వెబ్ సీరిస్ ల సీజన్. వరస పెట్టి వెబ్ సీరిస్ లు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వాటికి గ్లామర్ అద్దే కార్యక్రమం మొదలైంది. సినిమావాళ్లు సైతం వెబ్ సీరిస్ ల్లోకి రావటంతో స్టార్స్ ...వాటిల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రానా వంటి వారు వెబ్ సీరిస్ లతో బిజీగా ఉండగా ఇప్పుడు రమ్యకృష్ణ సైతం ఈ రంగంలోకి దూకుతున్నారు. అయితే రమ్యకృష్ణ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అయినా సరే ఆమె ఈమె వెబ్ సీరిస్ సైన్ చేయటానికి కారణం ...దర్శకుడు గౌతమ్ మీనన్. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను ఈ వెబ్ సీరిస్ లో  పోషించనున్నారు రమ్యకృష్ణ.  ‘ఘర్షణ, ఏ మాయ చేసావె’ ఫేమ్‌ గౌతమ్‌ మీనన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. 30 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో జయలలిత జీవితానికి సంబంధించిన అన్ని కీలక ఘట్టాలను కవర్‌ చేయనున్నారు.

ఇక మొదట  ఈ వెబ్‌ సిరీస్‌ను అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్‌ (బాబీ) నిర్మించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ నిర్మాణంలో ఆయన భాగం కారని అల్లు అరవింద్ కు చెందిన వారు  పేర్కొన్నారు. ఇక ఈ వెబ్ సీరిస్ క్లిక్ అయితే రమ్యకృష్ణ మరిన్ని ప్రాజెక్టులు సైన్ చేసే అవకాసం ఉంది.

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?