గౌతమ్‌ని రంగంలోకి దించుతున్న మహేష్‌

Published : Aug 30, 2020, 08:31 PM ISTUpdated : Aug 30, 2020, 08:34 PM IST
గౌతమ్‌ని రంగంలోకి దించుతున్న మహేష్‌

సారాంశం

తాజాగా మహేష్‌ సైతం తన వారసుడు గౌతమ్‌ని ఇండస్ట్రీకి అలవాటు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన `వన్‌ః నేనొక్కడినే` చిత్రంలో తన చిన్ననాటి పాత్రలో గౌతమ్‌ని నటింప చేశారు.

సినీ స్టార్స్ తమ పిల్లలను చిన్నతనంలోనే రంగంలోకి దింపుతుంటారు. బాలనటులుగా పరిచయం చేసి ఆడియెన్స్ మెదళ్ళలో చిన్నప్పట్నుంచే గుర్తుండేలా చేస్తుంటారు. క్రమ క్రమంగా ఆడియెన్స్ కి అలవాటు చేస్తుంటారు. హీరోలుగానే, హీరోయిన్లుగానో, ఇతర టెక్నీషియన్లుగానే పరిచయం చేసేందుకు వేసే ఎత్తుగడ ఇది. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడిగా మహేష్‌బాబు సైతం బాలనటుడిగానే వెండితెరకు పరిచయం అయ్యారు. `నీడ` చిత్రంతో తెరపై మెరిసిన మహేష్‌..ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. తాజాగా మహేష్‌ సైతం తన వారసుడు గౌతమ్‌ని ఇండస్ట్రీకి అలవాటు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన `వన్‌ః నేనొక్కడినే` చిత్రంలో తన చిన్ననాటి పాత్రలో గౌతమ్‌ని నటింప చేశారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. అలాగే గతేడాది తన ముద్దుల తనయ సితారని హాలీవుడ్‌ చిత్రం `ఫ్రోజెన్‌ 2`లో బేబీ ఎల్సాకి తెలుగు వాయిస్‌ అందించి పరిచయం చేశారు. 

ఇదిలా ఉంటే రేపు(సోమవారం) గౌతమ్‌ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సాయంత్ర బర్త్ డే కామన్‌ డీపీని విడుదల చేశారు. రేపటితో గౌతమ్‌ 14ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. అయితే అభిమానులు గౌతమ్‌ని ఆకాశానికి ఎత్తే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. మహేష్‌తో ఉన్న చిన్ననాటి గౌతమ్‌ ఫోటోని `హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ గౌతమ్‌` కామన్‌ డీపీగా విడుదల చేశారు.

 ఇదిలా ఉంటే ఇందులో గౌతమ్‌ని అప్పుడే ప్రిన్స్ చేయడం విశేషం. ఈ యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేయాలని మహేష్‌ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారట. మరి యాష్‌ ట్యాగ్‌ ట్వీట్లతో రికార్డ్ లేమైనా క్రియేట్‌ చేస్తారేమో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు