బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్

By Asianet News  |  First Published Dec 3, 2023, 10:41 PM IST

ఒకవేళ తక్కువ ఓట్లు వచ్చి ఉంటే ఎలిమినేట్ అవుతావు అని నాగార్జున హెచ్చరించినా ప్రశాంత్ వినలేదు. చివరకి ప్రశాంత్ ధైర్యమే గెలిచింది.


కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. నేడు సండే కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్ వీక్ సమీపిస్తుండడంతో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత దక్కబోతోందో రివీల్ చేశారు. 

అక్షరాలా రూ. 50 లక్షల నగదు విన్నర్ కి దక్కుతుంది. అంతే కాదు మరిన్ని ఎక్స్ట్రా బోనాంజాలు కూడా ఉన్నాయి. మారుతి సుజుకి బ్రీజ్ కారు తో పాటు 15 లక్షల విలువ చేసే డైమండ్ జ్యువెలరీ కూడా దక్కుతుంది అని నాగార్జున ప్రకటించారు. ఆ 50లక్షలు గెలిస్తే మీరు ఏం చేస్తారు అని నాగార్జున ఇంటి సభ్యులని అడిగారు. గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి తమ కుటుంబ సభ్యుల కోసం, తల్లి దండ్రుల కోసం, సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వెచ్చిస్తాం అని బదులిచ్చారు. 

Latest Videos

ఇక శివాజీ ఇంకా తనదగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవని అన్నారు. ఇక ప్రశాంత్ మాత్రం కష్టాల్లో ఉన్న రైతులని ఆదుకునేందుకు వెచ్చిస్తా అని బదులిచ్చాడు. ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ప్రియాంక సేవ్ అయింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ వేదికపైకి కొందరు సెలెబ్రిటీ గెస్ట్ లు వచ్చారు. ముందుగా నాగార్జున 'నా సామిరంగ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెని నాగార్జున కంటెస్టెంట్స్ పరిచయం చేశారు. 

నా సామిరంగ చిత్రంలో ఆషిక పాత్రని పరిచయం చేసేలా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో ఆషిక అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంటి సభ్యులంతా ఆషికని చూసి థ్రిల్ అయ్యారు. అనంతరం నేచరుల్ స్టార్ నాని వేదికపై సందడి చేశారు. 

హాయ్ నాన్న చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. హాయ్ నాన్న విశేషాలని నాని కాసేపు నాగార్జునతో పంచుకున్నారు. అనంతరం ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాని వేసిక జోకులు అలరించాయి. నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని నాగార్జున.. నాని చేతుల మీదుగా సేవ్ చేయించారు. నామినేషన్స్ లో ఉన్న వారికి కొన్ని బాటిల్స్ ఇచ్చారు. నాని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఎవరి బాటిల్ లో గ్రీన్ ఇసుక ఉంటుందో వారు సేఫ్. శివాజీకి గ్రీన్ సాండ్ రావడంతో అతడు సేవ్ అయ్యాడు. 

అనంతరం మరో సేవింగ్ రౌండ్ లో పెద్ద డ్రామానే సాగింది. చివరికి శోభా, గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్ దక్కర ఏవిక్షన్ ప్రీ పాస్ ఉంది. దానిని ఇప్పుడే వాడుకోవాలని లేకుంటే ఇంకా వాడుకోవడం కుదరదు అని నాగార్జున తెలిపారు. నీవు వాడుకొని పక్షంలో మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఇవ్వొచ్చు అని నాగార్జున చెప్పారు. అయితే ప్రశాంత్ సంచలనంగా తనకు ఏవిక్షన్ పాస్ అవసరం లేదని తాను ప్రేక్షకుల నిర్ణయం ప్రకారమే వెళతా అని నాగార్జునకి చెప్పారు. 

Also Read: యానిమల్ లో వల్గర్ సీన్లు, బూతులు చూడలేదా..అనసూయని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్

ఒకవేళ తక్కువ ఓట్లు వచ్చి ఉంటే ఎలిమినేట్ అవుతావు అని నాగార్జున హెచ్చరించినా ప్రశాంత్ వినలేదు. చివరకి ప్రశాంత్ ధైర్యమే గెలిచింది. ఆ ముగ్గురిలో ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో మిగిలింది శోభా శెట్టి, గౌతమ్ మాత్రమే ఉన్నారు. వారిని నాగార్జున ప్రత్యేక రూమ్ కి తీసుకెళ్లారు. ఇద్దరి వెనుక శ్వాస తీసుకునే డ్రాగన్స్ ఉంటాయి. ఎవరి వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోతే వాళ్ళు ఎలిమినేట్. గౌతమ్ వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోయింది. దీనితో ఫైనల్ వీక్ కి ముందు ఎలిమినేటి అయిన కంటెస్టెంట్ గా నిలిచాడు. 

click me!