
బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం హిందీ సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్నిఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ దక్కించుంది. ఎస్ హుస్సేన్ జాడి రచించిన మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘మేరీజాన్’సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో సాంగ్ లో అలియా భట్.. శంతన్ మహేశ్వరి రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాతకాలపు కారులో వెనక సీట్ లో అలియా, శంతన్ కూర్చొని ఉండగా.. ముద్దులకు ఎలా ఇవ్వాలో గంగుబాయి ఓ వ్యక్తికి నేర్పిస్తూ ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కాగా, అలియా నటనకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు పలువురు బాలీవుడ్ నటులు కూడా ఈ సాంగ్ బాగుందంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ మూవీ ఇప్పటికే బెర్లిన్ లో ప్రీమియర్ పూర్తి చేసుకుంది. నాలుగు రోజుల్లో హిందీ, తెలుగులో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ రోజు 'మేరీ జాన్' పాటను విడుదల చేసి, తమ మూవీలోని రొమాంటక్ సీన్లను బయటపెట్టారు. కాగా ఈ సాంగ్ కు సంజయ్ లీలా భన్సాలీ మ్యూజిక్ అందించగా, నీత్ మోహన్ గాత్రం దానం చేశారు. లిరిక్స్ కుమార్ రాశారు.
మరోవైపు అలియా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో సీత పాత్రలో నటిస్తోంది. దీంతో ఆమెకు తెలుగు మార్కెట్ ఏర్పడనుంది. ఈ క్రమంలో 'గంగూబాయి కతియావాడి' తెలుగు లోనూ విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ సైతం తెలుగులో రిలిజ్ చేశారు మేకర్స్. అలియా భట్ మాట్లాడుతూ 'అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'గంగూబాయి కతియావాడి' టీజర్ తెలుగులోనూ విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తెలిపారు. ఈ టీజర్‌కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.