Jr NTR: ఎన్టీఆర్ ర్యాగింగ్ చేస్తే అలా ఉంటుంది.. టెంపర్, పటాస్ రెండు కథలు ఒక్కటే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 21, 2022, 04:00 PM IST
Jr NTR: ఎన్టీఆర్ ర్యాగింగ్ చేస్తే అలా ఉంటుంది.. టెంపర్, పటాస్ రెండు కథలు ఒక్కటే

సారాంశం

ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని రివీల్ చేశాడు.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని రివీల్ చేశాడు. అనిల్ రావిపూడి నందమూరి కళ్యాణ్ రామ్ 'పటాస్' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 

ఆ చిత్రం ఘన విజయం సాధించింది. పటాస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు తరచుగా ఆఫీస్ కి వస్తుండేవారు. ఆయన వచ్చిన ప్రతి సారీ నాపై ర్యాగింగ్ చేసేవారు. సెటైర్లు వేస్తూ, జోకులు పేల్చుతూ సరదాగా ఉండేవారు. నాక్కూడా ఒక కథ చెప్పు అని అడిగేవారు. నా మొదటి సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు సర్. అప్పుడే ఎలా కథ చెప్పాలి అని అంటే.. అనిల్ నాకు కథ చెప్పడట.. చూసుకుందాం అంటూ సరదాగా ర్యాగింగ్ చేసేవారు. 

పటాస్ టైంలో ఎన్టీఆర్ తో స్పెండ్ చేసిన టైం మరచిపోలేను అని అనిల్ రావిపూడి అన్నారు. ఇక పటాస్, టెంపర్ చిత్రాల కథలు ఒకేలా ఉండడంపై అనిల్ రావిపూడి స్పందించారు. నేను, వక్కంతం వంశి గారు కలిసింది లేదు.. కథలు షేర్ చేసుకుంది లేదు. ఆలోచన విధానం ఒకేలా ఉండొచ్చు. అందుకే రెండు కథల్లోని పాయింట్ ఒక్కటే. కానీ నా స్టైల్ లో నేను తీసా.. పూరి స్టైల్ లో టెంపర్ తీశారు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. 

కథల కోసం కొట్టుకునేవారికి నేను చెప్పేది ఒక్కటే. ఏ ఇద్దరి ఆలోచనలు పూర్తిగా ఒకేలా ఉండవు. కొన్ని సిమిలర్ గా ఉండొచ్చు. అంతమాత్రాన ఏమీ జరిగిపోదు. ఒకే పాయింట్ తో విభిన్నంగా సినిమాలు చేయొచ్చు అని అనిల్ రావిపూడి అన్నారు. 

పటాస్ హిట్ అయిన తర్వాత నుంచి అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు వీరిద్దరి కాంబో సెట్ కాలేదు. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?