
బాలీవుడ్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై హత్యకు కుట్ర జరిగిందనే వార్త కలకలం సృష్టిస్తుంది. ఇందులో రాజస్థాన్, పంజాబ్‌లకు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకి సంబంధాలున్నట్టు తెలుస్తుంది. ఆ ముఠాకి చెందిన కొందరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో షార్ప్ షూటర్ రాహుల్‌ని ఉత్తరాఖండ్‌లోని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్‌ని హత్య చేసే పని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. రాహుల్‌కి అప్పగించారని తెలుస్తుంది.
పోలీసుల కథనం ప్రకారం.. సల్మాన్ ఉండే బాంద్రాలో రాహుల్ గ్యాంగ్..సల్మాన్‌ని చంపేందుకు ఈ ఏడాది జనవరిలో రెక్కీ నిర్వహించిందని తెలుస్తుంది. మరోవైపు రాహుల్.. ఇటీవల ఫరీదాబాద్‌లో ప్రవీణ్ అనే యువకుడిని హత్య చేయగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్‌ని విచారించగా ఈ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అందులో భాగంగా సల్మాన్‌ని చంపేందుకు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వెంటాడిన కేసులో జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకని దైవంగా ఆరాధిస్తారు. దీని కారణంగానే సల్మాన్‌పై కోపం పెంచుకుని హత్యకు రెండేళ్ళుగా కుట్ర చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సంచలన విషయంతో బాలీవుడ్ షాక్‌కి గురవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని ఎవరో కుక్క బెల్ట్ తో గొంతు నులిమి చంపేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో షాకింగ్ విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తుంది.