శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేసిన గంగవ్వ.. `రాజ రాజ చోర` టీజర్‌

Published : Jun 18, 2021, 05:00 PM ISTUpdated : Jun 18, 2021, 05:03 PM IST
శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేసిన గంగవ్వ.. `రాజ రాజ చోర` టీజర్‌

సారాంశం

గంగవ్వ పెద్ద తెరపై మెరవబోతుంది. ఆమె శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న `రాజ రాజ చోర` చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు ఇందులో ఏకంగా హీరో శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేస్తుంది.

గంగవ్వ పెద్ద తెరపై మెరవబోతుంది. ఆమె శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న `రాజ రాజ చోర` చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు ఇందులో ఏకంగా హీరో శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేస్తుంది. తాజాగా ఇది హాట్‌ టాపిక్‌గా, వైరల్‌గా మారింది. `రాజ రాజ చోర` చిత్ర టీజర్‌ శుక్రవారం విడుదలైంది. ఇది హసిత్‌ గోలీ దర్శకత్వంలో రూపొందుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలై చక్కర్లు కొడుతుంది. ఇందులో శ్రీవిష్ణ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా, దొంగగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించనున్నారు. అయితే ఓ క్రమంలో గంగవ్వతో కలిసి ఆయన బాధలు చెప్పుకోవడం, ఆమెతో కలిసి మందేయడం ఆసక్తికరంగా మారింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్‌ స్పష్టం చేస్తుంది. `రాజ రాజ చోర` టైటిల్‌కి తగ్గట్టుగా చివరికి కిరిటాలు పెట్టుకుని, స్కూటిపై వెళ్లడం ఆకట్టుకుంటుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..