స్టార్ కమెడియన్ తో శంకర్ కి సయోధ్య కుదిరిందా!

Published : Jun 18, 2021, 04:00 PM ISTUpdated : Jun 18, 2021, 04:10 PM IST
స్టార్ కమెడియన్ తో శంకర్ కి సయోధ్య కుదిరిందా!

సారాంశం

హింసై  అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేశాడు. తెలుగులో హింసించే యువరాజు 23వ పూలకేసిగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ  చిత్రం హిట్ కావడంతో, వడివేలుతో సీక్వెల్ నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.  

చాలా కాలంగా దర్శకుడు శంకర్‌ కమెడియన్ వడివేలు  మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదు చేసుకున్నారు. హింసై  అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేశాడు. తెలుగులో హింసించే యువరాజు 23వ పూలకేసిగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ  చిత్రం హిట్ కావడంతో, వడివేలుతో సీక్వెల్ నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.

షూటింగ్‌ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు.

పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..