`క్యాస్టింగ్‌ కౌచ్‌`ః 14 మంది ప్రముఖుల పేర్లు బయటపెట్టిన `పట్నఘడ్‌` నటి

Published : Jun 18, 2021, 04:40 PM IST
`క్యాస్టింగ్‌ కౌచ్‌`ః 14 మంది ప్రముఖుల పేర్లు బయటపెట్టిన `పట్నఘడ్‌` నటి

సారాంశం

మలయాళ నటి రేవతి సంపత్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. `క్యాస్టింగ్‌ కౌచ్‌`కి సంబంధించి తనని వేధిస్తున్న కొందరి వ్యక్తుల పేర్లని ధైర్యంగా బయటపెట్టింది. ఇందులో సినిమాకి చెందిన  ప్రముఖులు ఉండటం ఇప్పుడు మాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది.  

మలయాళ నటి రేవతి సంపత్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. `క్యాస్టింగ్‌ కౌచ్‌`కి సంబంధించి తనని వేధిస్తున్న కొందరి వ్యక్తుల పేర్లని ధైర్యంగా బయటపెట్టింది. బోల్డ్‌గా మాట్లాడటమే కాడు, అంతకు మించి బోల్డ్ గా వారి పేర్లని తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. వారి ఫోటోలతో సహా రేవతి బయటపెట్టడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో సినిమాకి చెందిన  ప్రముఖులు ఉండటం ఇప్పుడు మాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది.

రేవతి పంచుకున్న 14 మంది వ్యక్తుల్లో దర్శకుడు రాజేష్‌ టచ్‌రివర్‌, నటులు సిద్ధిక్‌, సిజ్జు, ఫోటోగ్రాఫర్‌ ఆషికి మహి ఉన్నట్టు వెల్లడించింది. వీరి పేర్లని ముందు వరుసలో ఉంచింది రేవతి సంపత్‌. వీరితోపాటు క్యాస్టింగ్‌ డైరెక్టర్‌, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌, యాడ్‌ డైరెక్టర్‌, ఓ డాక్టర్‌, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఉన్నారని వెల్లడించింది.  `ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను` అని రేవతి తెలిపారు. 

రేవతి సంపత్‌ పంచుకున్న వారి జాబితా చూస్తే, 1.రాజేశ్‌ టచ్‌రివర్‌  (దర్శకుడు), 2. సిద్ధిక్‌ (నటుడు), 3. ఆషికి మహి(ఫొటోగ్రాఫర్‌), 4. సిజ్జు (నటుడు), 5. అభిల్‌ దేవ్‌ (కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌), 6. అజయ్‌ ప్రభాకర్‌ (డాక్టర్‌), 7. ఎంఎస్‌ పదూష్‌ (అబ్యూసర్‌), 8. సౌరబ్‌ కృష్ణన్‌ (సైబర్‌ బల్లీ), 9. నందు అశోకన్‌ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్‌), 10. మాక్స్‌వెల్‌ జోస్‌ (షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌), 11. షానుబ్‌ కరావత్‌ (యాడ్‌ డైరెక్టర్‌ ), 12. రాగేంద్‌ పై (క్యాస్టింగ్‌ డైరెక్టర్‌), 13. సరున్‌ లియో (ఈఎస్‌ఎఎఫ్‌ బ్యాంక్‌ ఏజెంట్‌), 14. బిను (సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పొన్‌తూరా స్టేషన్‌, తిరువనంతపురం) వంటి వారున్నారు. రేవతి సంపత్‌ 2019లో `పట్నఘడ్‌‌` చిత్రంతో నటిగా పరిచయమైంది. దీనికి రాజేష్‌ టచ్‌ రివర్‌ దర్శకుడు. తెలుగులోనూ ఇది విడుదలైంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?