ఫ్లాప్స్ ఉంటే ఏంటి..? రూ.75 లక్షలు ఇస్తేనే చేస్తా..!

By Udayavani DhuliFirst Published Dec 13, 2018, 12:21 PM IST
Highlights

వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా.. కొందరు హీరోయిన్లు మాత్రం రెమ్యునరేషన్,ఇతర విషయాల్లో అసలు తగ్గరు. ఇప్పుడు మెహ్రీన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ ఏడాదిలో మెహ్రీన్ కి వచ్చినన్ని ఫ్లాప్ లు ఏ హీరోయిన్ కి వచ్చి ఉండవు. 

వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా.. కొందరు హీరోయిన్లు మాత్రం రెమ్యునరేషన్,ఇతర విషయాల్లో అసలు తగ్గరు. ఇప్పుడు మెహ్రీన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ ఏడాదిలో మెహ్రీన్ కి వచ్చినన్ని ఫ్లాప్ లు ఏ హీరోయిన్ కి వచ్చి ఉండవు.

వరుసగా పరాజయాలు అందుకుంటూనే ఉంది. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమా అవకాశం వస్తే.. కాస్త రెమ్యునరేషన్ తగ్గించడం వంటి పనులు చేస్తుంటారు కొందరు హీరోయిన్లు. కానీ మెహ్రీన్ మాత్రం ఓ సినిమా కోసం ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేస్తుందట.

నిజానికి హీరోయిన్ గా నటించడానికి మెహ్రీన్ కి ముప్పై నుండి యాభై లక్షలు మాత్రమే ఇస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఫ్లాప్ లలో ఉన్నాననే ఫీలింగ్ కూడా లేకుండా నిర్మాతలను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకోవాలనుకున్నారు.

దీంతో ఆమెని సంప్రదించిన నిర్మాతలకు రూ.75 లక్షలు రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చింది. పైగా జిఎస్టీ, ఫ్లైట్ టికెట్లు, హోటల్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే మరో ఇరవై లక్షలు కావడం ఖాయం. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫ్లాప్ లు వస్తున్నా.. మెహ్రీన్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడడం లేదు. 

click me!