శింబు చెత్త బిహేవియర్.. ఐదుగురు నిర్మాతలు కంప్లైంట్

By tirumala ANFirst Published Sep 1, 2019, 10:20 AM IST
Highlights

తమిళ స్టార్ హీరో శింబు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.  ఆయనపై వరస పెట్టి నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ ఏమీ బాగోలేదని, సినిమాలు చేస్తానని ఒప్పుకుని వాటిని మధ్యలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై  ఇప్పటికి ఐదుగురు పెద్ద నిర్మాతలు కంప్లైంట్ చేసారు. ఈ నేపధ్యంలో  విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. 

ఆ కంప్లైంట్స్ లో మొదటిగా ...శింబు ప్రధాన పాత్ర పోషించిన 'అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌' చిత్రంతో తనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ పేర్కొన్నారు. ఆ చిత్రం సెకండ్ పార్ట్  తీయడానికి శింబు అంగీకరించలేదన్నారు. 

ఇక నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చేసిన ఫిర్యాదులో.. శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని, షూటింగ్‌ పనులు ప్రారంభమైనప్పటికీ ఆయన సహకరించక పోవడంతో ఆ చిత్రం షూటింగ్‌ ఆగిపోయిందన్నారు. 

ఎస్కేప్‌ ఆర్ట్స్‌కు చెందిన నిర్మాత మదన్‌ చేసిన కంప్లైంట్ లో.. తన చిత్రంలోనూ శింబును నటింపజేయడానికి ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఆయన సహకరించని కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. 

ఆదే తరహాలోనే తాను మోసపోయినట్లు గొరిల్లా చిత్ర నిర్మాత సురేష్‌ ఫిర్యాదు చేశారు. సురేష్‌ కామాక్షి అనే మరో నిర్మాత కూడా శింబు హీరోగా తాను నిర్మించతలపెట్టిన 'మానాడు' చిత్రం షూటింగ్‌ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిందన్నారు. 

ఇలా వరసపెట్టి కంప్లైంట్స్  సంఖ్య పెరుగుతుండడంతో నిర్మాతల మండలి చర్యలు మొదలెట్టింది.  ఆరోపణల్లో వాస్తవమున్న పక్షంలో శింబు చేత సంబంధిత నిర్మాతలకు నష్ట పరిహారం ఇప్పించడం, ఆయనపై చర్యలు తీసుకోవడం వంటివి ఘటనలు జరిగే అవకాశం ఉందని నిర్మాతల మండలి సభ్యులు మీడియా తెలిపారు.

click me!