ఐదు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిన ఖైదీ నంబర్ 150

Published : Jan 16, 2017, 01:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఐదు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిన ఖైదీ నంబర్ 150

సారాంశం

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఖైదీ

దాదాపు పదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి చేసిన 'ఖైదీ నెంబర్ 150' .. అంతా అనుకున్నట్టే రికార్డులను సృష్టిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా .. యూఎస్ లోను ఈ సినిమా తన దూకుడు చూపిస్తోంది. ఈనెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే 47 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఇక 5 రోజులు పూర్తయ్యే నాటికి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 5 రోజులు పూర్తయ్యే నాటికి ఈ సినిమా 106.12 కోట్ల గ్రాస్ ను .. 72. 51 కోట్ల షేర్ ను సాధించింది. కథ .. కథనాల సంగతి అటుంచితే .. చిరంజీవి ఛరిష్మానే దీనికి కారణమని చెప్పుకుంటున్నారు. టీజర్లు .. ఆడియో విషయంలోనే కాదు , వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉండటం విశేషం.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పాపం నరేష్ కి హ్యాండిచ్చిన బిగ్ బాస్, అమన్ కష్టానికి ప్రతిఫలం.. సిగ్గులేని ఆట అంటూ ముకేశ్ ఫైర్
Aadharsha Kutumbam: ఆదర్శ కుటుంబం వాయిదా వల్ల మేము నష్టపోయాం.. నాగవంశీకి నిర్మాత చురకలు