Mahesh Babu : జనవరిలోనే సర్కారు వారి పాట నుంచి మొదటి పాట వచ్చే అవకాశం..!

Published : Jan 14, 2022, 10:39 AM IST
Mahesh Babu : జనవరిలోనే సర్కారు వారి పాట నుంచి మొదటి పాట వచ్చే అవకాశం..!

సారాంశం

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు  సర్కారు వారి పాట మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు  రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కొంత రివీల్ అవుతున్నాయి.  ఈ జనవరిలోనే ప్రేక్షకుల  కోసం సర్కారు వారి పాట నుంచి మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్టు కొంత సమాచారం.   

సూపర్ స్టార్ మహేష్ బాబు(super star Mahesh babu) సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. అయితే మహేశ్ బాబు సినిమా షూట్ ప్రారంభమై, థియేటర్లలోకి వచ్చే వరకూ మహేశ్ బాబు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, కీర్తీ సురేష్(keerthi suresh) హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీకి పెట్ల పరుశురామ్(petla parshuram) దర్శకత్వం వహిస్తున్నాడు.  
ఈ మూవీ భారీ యాక్షన్,  స్టైలిష్ ఎంటర్ టైన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ గురించి సినీ ప్రియులు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఓ స్వీట్ న్యూస్ అనే చెప్పాలి. 
ఈ జనవరి నెలలోనే సర్కారు వారి పాట నుంచి మొదటి సాంగ్ రానుందని కొంత సమాచారం. అయితే ఈ సాంగ్ ఈ నెల మొదటి వారం లోనే రావాల్సింది. కానీ రాకపోవడంతో మ్యూజిక్ లవర్స్, మహేశ్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు.  కానీ తర్వాత సంక్రాంతికి వాయిదా వేయడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.  ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  
ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్ రిలీజ్ పై ప్రకటన వెలువడనున్నట్టు లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి ట్రెండీ మ్యూజిక్ అందిస్తున్న థమన్ ఫస్ట్ సాంగ్ ని ఏ రేంజ్ లో కంపోజ్ చేసి ఉంటాడోనని అభిమానులు, మ్యూజిక్ లవర్స్   ఆసక్తి చూపుతున్నారు.  

ఇటీవల మహేశ్ బాబుు అన్న చనిపోవడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తన అన్న  మ్రుతిని మహేశ్ జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటికే కరోనాకు గురైన మహేశ్ బాబు సొంత అన్న అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కోవిడ్ బారిన పడకుండా అభిమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి