స్పీడ్ మీదున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ సింగిల్ అప్డేట్

By Mahesh JujjuriFirst Published Dec 22, 2022, 7:43 PM IST
Highlights

మంచి స్పీడు మీద ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథా అంటూ.. రాబోతున్నాడు. ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డెన్ ను రెడీ చేస్తున్నారు. 

ఇక  వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు  యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ యంగ్ స్టార్   హీరోగా నటిస్తున సినిమా వినరో భాగ్యము విష్ణుకథ .కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయడం కోసం రెడీ అవుతున్నారు మూవీ టీమ్. వాసవసుహాస అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈసారి కిరణ్ అబ్బవరం ఇంకాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడీ మూవీలో. 

వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను  2023 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీకి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న వినరో భాగ్యము విష్ణు కథ... సినిమాకు స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. 

click me!