ఈ దాడులు నన్నేం చేయలేవు, చెప్పుల దాడిపై స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్

By Mahesh JujjuriFirst Published Dec 22, 2022, 6:58 PM IST
Highlights

కన్నడ స్టార్ హీరో దర్శన్ తనపై జరిగిన దాడి గురించి స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇష్షూలో ఆయన స్పందన గురించి అంతా వెయిట్ చేస్తుండగా.. దర్శన్ ఈ ఇష్షూ గురించి మాట్లాడారు. 
 

కన్నడ హీరో దర్శన్ పై చెప్పుదాడి జరిగిన సంఘటన గురించి తెలిసిందే. అదృష్ట దేవతపై దర్శన్ చేసిన వల్గర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. చాలా మంది ఈ విషయంలో దర్శన్ ను విమర్షించడంతో పాటు.. ఈ హీరో ట్రోల్ అవుతూ వచ్చాచు. ఈక్రమంలోనే దర్శన్ తాజా మూవీ క్రాంతి సినిమా ప్రమోషన్లో పాల్గోంటున్న దర్శన్ కు నిరసనలు తప్పడంలేదు.  ఈ సినిమా జనవరిలో రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో క్రాంతి  నుంచి రెండో పాటను విడుదల చేయడానికి హోస్పేటలో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశారు. 

ఈ ఈవెంట్ కు దర్శన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు.  అభిమానులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శన్ మాట్లాడుతూ ఉండగా ఒక అభిమాని తనపై చెప్పుతో దాడి చేశారు.ఇక ఈవెంట్ ప్రారంభానికి ముందు దర్శన్ అభిమానులు పునీత్ అభిమానుల మధ్య గొడవ కూడా జరగడంతో  పునీత్ అభిమానులే హీరో దర్శన్ పై గొడవకు పాల్పడి ఉంటారని అందరూ భావించారు. 

ఇక  ఈ దాడి జరిగిన తీరుపై మొదటిసారి నటుడు దర్శన్ స్పందించారు. దర్శన్  మాట్లాడుతూ… ఇలాంటి సమయంలో తనకు మద్దతు తెలుపుతూ అండగా నిలిచిన నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో నాకన్నా నా సహనటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారు.ఇలాంటి ఘటనలు ఒక మనిషిని ఎప్పుడూ బలహీనపరచవని వారిని మరింత దృఢంగా మారుస్తాయని దర్శన్  చెప్పుకొచ్చారు.

అయితే అంతకు ముందు ఈ ఘటనపై చాలా మంది కన్నడ స్టార్స్ స్పందించారు. ఇలా ఒక  హీరో పై చెప్పుతో దాడి జరగడంతో ఈ ఘటనపై దర్శన్ కి మద్దతుగా నిలిచారు. కన్నడ హీరో సుదీప్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్,ధనుంజయ్ రమ్య లాంటి ఎంతో మంది స్టార్ ఇతర సెలబ్రిటీలు కూడా అభిమానుల వ్యవహార శైలిని తప్పుపడుతూ నటుడు దర్శన్ కు సపోర్ట్ గా నిలిచారు. 

ఇక అసలు ఈ ఇష్యూను మొదలు పెట్టిందే దర్శన్.  ఒక ఇంటర్వ్యూలో దర్శన్ మాట్లాడుతూ.. అదృష్ట దేవంత అంటూ ఉండదు. ఒక వేళ ఉండీ.. మీ ఇంటికి వచ్చి తలుపు తడితే.. లోకపలికి లాగి వివస్త్రను చేయండి.. బట్టలు లేకుండా ఆమె బయటకు వెళ్ళదు కదా.. మీరు డ్రెస్ ఇస్తేనే ఆమె బయటకు వెళ్తుంది అంటూ.. నోడి దురుసు ప్రదర్శిచాడు దర్శన్. దాంతో దేశ వ్యాప్తంగా దర్శన్ పై విమర్షలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్లు. 

click me!