రెమ్యునరేషన్ భారీగా పెంచిన దళపతి విజయ్, రజనీకాంత్ ను క్రాస్ చేశాడా..?

Published : Dec 22, 2022, 04:38 PM IST
రెమ్యునరేషన్ భారీగా పెంచిన దళపతి విజయ్, రజనీకాంత్ ను క్రాస్ చేశాడా..?

సారాంశం

తమిళనాట దళపతి విజయ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత విజయ్ కే ఆ రేంజ్ లో ఇమేజ్ ఉంది తమిళనాట. ఈక్రమంలో విజయ్ రెమ్యునరేషన్ కు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ.. తమిళనాట ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రజనీ కాంత్ రికార్డ్ లో ఉన్నారు. ఆయన దాదాపు గా సినిమాకు 120 కోట్లకు పైగా తీసుకుంటుంటే.. ఆయన తరువాత స్థానంలో దళపతి  విజయ్ ఉన్నారు. విజయ్ సినిమాకు  100 కోట్ల వరకూ తీసకుంటున్నారట. ఈక్రమంలో.. విజయ్ తలైవాన్ దాటేసి.. రెమ్యూనరేషన్ ను భారీగాపెంచినట్టు తెలుస్తోంది. బీస్ట్ ఫెయిల్యూర్ లో ఉన్న విజయ్.. రెమ్యూనరేషన్ విషయంలో  ఏమాత్రం తగ్గడంలేదట.  

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నాట విజయ్. ఇంతకు ముందు సినిమా కంటే ఈసినిమాకే ఆయన ఎక్కువ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. రిలీజ్ కాబోతుంది. ఇటు తెలుగు లో అటు తమిళ్ లో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడబోతోంది మూవీ.  ఈసినిమా తరువాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ ఒక సినిమా ప్లాన్ చేసిట్టు తెలిసింది. ఈసినిమా విజయ్ 67 వ సినిమాగా తెరకక్కకుతుది.  త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకావం ఉంది. 

ఇక మరో వైపు విజయ్ తన తదుపరి 68వ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో చేయబోతున్నారట. ఈసినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తాడని సమాచారం. వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఈక్రమంలో విజయ్ తన 68వ సినిమా నుంచి రెమ్యూనరేషన్ పెంచబోతున్నాడట.  దాదాపుగా 400 కోట్ల బడ్జట్ తో తెరకెక్కుతు్న ఈసినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  ఈలెక్కన్న చూసుకుంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ ను క్రాస్ చేసి.. తమిళనాట హైయోస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ గా విజయ్ నిలవబోతున్నాడు. 

విజయ్ వారసుడు మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈసినిమాను టాలీవుడ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి తెరకెక్కించారు. ఈ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాను విజయ్ చేయబోతున్నారట. విజయ్ వారసుడు సినిమాతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పోటీపడబోతున్నాడు. టు తమిళనాట స్టార్ హీరో అజిత్ తో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్ అయితే ఫ్యాన్స్ వార్ జరగడం ఖాయమనే చెప్పాలి. 


 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?