కిక్కెక్కించేలా 'జర్రా జర్రా'.. వాల్మీకి తొలి పాట అదుర్స్!

Published : Aug 21, 2019, 06:03 PM ISTUpdated : Aug 21, 2019, 09:02 PM IST
కిక్కెక్కించేలా 'జర్రా జర్రా'.. వాల్మీకి తొలి పాట అదుర్స్!

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన హరీష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. వాల్మీకి చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండకు రీమేక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. 'జర్రాజర్రా' అంటూ సాగే ఐటెం నంబర్ ఇది. మాస్ ప్రియులకు ఈ పాట మంచి కిక్కు ఇచ్చేలా ఉంది. డింపుల్ హయతి ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ తో నర్తించింది. 

భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ నటుడు అధర్వ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం