కార్గిల్ గర్ల్ గా జాన్వీ.. ఫస్ట్ లుక్ వైరల్

Published : Aug 29, 2019, 12:08 PM IST
కార్గిల్ గర్ల్ గా జాన్వీ..  ఫస్ట్ లుక్ వైరల్

సారాంశం

మొదటి సినిమా ధఢక్ సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన  జాన్వీ కపూర్ నటిగా మాత్రం తల్లికి తగ్గ తనయగా మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన గుంజన్ సక్సేనా బయోపిక్ తో సిద్ధమవుతోంది..  

కార్గిల్ లో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా పైలెట్ అయిన గుంజన్ జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలో ఆ ఒక్క మహిళ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది సినిమాలో చూపించనున్నారు. ఇక సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. గుంజన్ సక్సెన గా జాన్వీ కపూర్ సినీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. 

గ్లామర్ తో కాకుండా కెరీర్ మొదట్లోనే జాన్వీ ఇలాంటి కథల్లో నటించడం ప్రశసించాల్సిన విషయమని ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది మార్చ్ 13న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో