శిల్పా శెట్టి ముద్దుల తనయ ఫోటో లీక్‌ ‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

Published : Nov 21, 2020, 03:17 PM IST
శిల్పా శెట్టి ముద్దుల తనయ ఫోటో లీక్‌ ‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

సారాంశం

శిల్పా, రాజ్‌ కుంద్రాలకు 2012లో కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్ర జన్మించాడు. ఇక వీరు సరోగసి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకి జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న కూతురు సమీషా జన్మించింది. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కూతురుని అభిమానులకు పరిచయం చేయలేదు శిల్పా.

సాగర కన్య శిల్పా శెట్టి తన స్లిమ్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకున్నాక సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. మధ్య మధ్యలో ఐటెమ్‌ సాంగ్‌ల్లో మెరిసిందీ భామ.

శిల్పా, రాజ్‌ కుంద్రాలకు 2012లో కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్ర జన్మించాడు. ఇక వీరు సరోగసి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకి జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న కూతురు సమీషా జన్మించింది. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కూతురుని అభిమానులకు పరిచయం చేయలేదు శిల్పా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలను పంచుకున్నా, అందులో కనిపించకుండా మ్యానేజ్‌ చేశారు. 

అయితే ఇప్పుడు ఫోటోలకు దొరికిపోయింది. తన ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఫోటోలకు చిక్కింది. తన ముద్దుల తనయని క్లిక్‌మనిపించారు ఫోటోగ్రాఫర్లు. ఇందులో సమీషా చాలా బొద్దుగా ఎంతో క్యూట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

శిల్పా దాదాపు 13ఏళ్ళ తర్వాత నటిగా రీఎంట్రి ఇస్తుంది. ప్రస్తుతం `నికమ్మా`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తుంది. ఇవి వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్