ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ రివ్యూ 

By Sambi Reddy  |  First Published Sep 2, 2022, 6:01 PM IST

దివంగత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా తెరకెక్కింది ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడంతో హైప్ ఏర్పడింది. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో హీరోయిన్స్ గా దర్శకద్వయం వంశీధర్, లక్ష్మీ నారాయణ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నేడు విడుదల కాగా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం...


కథ 
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కథ చాలా సింపుల్. 2001లో పవన్ కళ్యాణ్ ఖుషి విడుదల నాటి నేపధ్యానికి సంబంధించింది. పవన్ వీరాభిమాని అయిన శ్రీనివాస్(శ్రీకాంత్ రెడ్డి) ఖుషి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటాడు. అలాగే శ్రీనివాస్ ప్రేయసి లయ(సంచితా బసు) కూడా పవన్ అభిమాని. ఫస్ట్ డే మొదటి షో తన లవర్ తో ఖుషి మూవీ చూడాలంటే శ్రీనివాస్ కి రెండు టికెట్స్ కావాలి. అది అంత సులువు కాదు. ఆ రెండు టికెట్స్ కోసం శ్రీనివాస్ పడ్డ పాట్లు ఏంటి? ఎదురైన కష్టాలేంటి? ఇంతకీ ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరికాయా? లేదా? .. అనేది మిగతా కథ.. 

పవన్ కళ్యాణ్ పుట్టినరోజును క్యాష్ చేసుకోవాలని చేసిన ప్రయత్నం తప్పితే దీన్ని ఓ సినిమాలా చూడలేం. ఖుషి టికెట్స్ కోసం పాట్లు పడే ఓ అభిమాని పాత్రను కామిక్ చెప్పాలని ట్రై చేశారు కానీ వర్క్ అవుట్ కాలేదు. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ సమకూర్చిన కథ కావడంతో పాటు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం మూవీపై హైప్ ఏర్పరిచింది. ఆడియన్స్ మూవీకి వచ్చేలా చేసింది. 
ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలలలో కథ ఉండాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, కామెడీ ఉంటే చాలు. ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రంలో అవే మిస్. జాతిరత్నాలు చిత్ర ఫార్ములానే ఈ చిత్రానికి వాడారు. ఫైనెస్ట్ యాక్టర్స్ ఆ చిత్రాన్ని రక్తి కట్టించారు. కానీ ఫస్ట్ షో ఫస్ట్ షో ఆద్యంతం బోరింగ్ గా సాగుతుంది. హీరో టికెట్స్ వేట ఆకట్టుకోగ పోగా కథ అక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి. 

Latest Videos

undefined

అందులోనూ 20 ఏళ్ల నాటి పరిస్థితులకు సంబంధించిన కథ. ఒక్క క్లిక్ తో టికెట్స్ పట్టేసే ఈ కాలం యువతకు కనెక్ట్ కావడం కష్టమే. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం నిజమే కదా అనుకోవచ్చు. హీరో శ్రీకాంత్ పాత్రలో ఎలాంటి కాంప్లెక్సిటీ, ఫ్రిక్షన్ ఉండదు. అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. కొత్త నటులు శ్రీకాంత్ రెడ్డి, సంచిత తమ పాత్రల పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు. 

వెన్నెల కిషోర్ సన్నివేశాలు కొంత రిలీఫ్. కొంతలో కొంత ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మొత్తంగా దర్శకులు వంశీధర్ , లక్ష్మీనారాయణల మొదటి ప్రయత్నం ఫస్ట్ డే ఫస్ట్ షో నిరాశపరిచింది. అనుదీప్ కథలో పసలేదని తేలిపోయింది. 
నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి

దర్శకులు : వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి

నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద

సంగీత దర్శకుడు: రాధన్

సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అక్కిరెడ్డి

ఎడిటర్: గుళ్లపల్లి సాంబశివరావు

రేటింగ్: 2.25/5 

click me!