ప్రభాస్‌ `ఆదిపురుష్‌` షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Published : Feb 02, 2021, 07:43 PM IST
ప్రభాస్‌ `ఆదిపురుష్‌` షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం..

సారాంశం

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ ప్రారంభమైన తొలిరోజే సెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. ఇందులో గ్రీన్‌ స్ర్కీన్‌ క్రోమా సెటప్‌ మొత్తం కాలిబూడిదైందని తెలుస్తుంది. ముంబయిలోని గోర్‌గాన్‌ స్టూడియోలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ ప్రారంభమైన తొలిరోజే సెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. ఇందులో గ్రీన్‌ స్ర్కీన్‌ క్రోమా సెటప్‌ మొత్తం కాలిబూడిదైందని తెలుస్తుంది. ముంబయిలోని గోర్‌గాన్‌ స్టూడియోలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా `ఆదిపురుష్‌` టీమ్‌ ఉలిక్కి పడింది. అయితే ఇందులో దర్శకుడు ఓరౌత్‌తోపాటు ఇతర టెక్నీషియన్లంతా క్షేమంగానే బయటపడినట్టు తెలుస్తుంది. కేవలం ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం.

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రం రూపొందుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. రాముడి తల్లి అయిన కౌసల్యగా హేమా మాలిని నటిస్తారని టాక్‌. మంగళవారం ఉదయం ఈ సినిమా ప్రారంభమైందని ప్రభాస్‌, దర్శకుడు ఔం రౌత్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైన రోజే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో చిత్ర బృందం కాస్త ఆందోళనకి గురవుతున్నట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?