స్టార్ హీరో సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం!

Published : Nov 30, 2018, 09:49 AM IST
స్టార్ హీరో సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం!

సారాంశం

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా 'జీరో' అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా 'జీరో' అనే సినిమాను రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. 

గురువారం ఈ సెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కప్పేసింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అప్పటికే సెట్ లో షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన వస్తువులన్నీ నాశనమయ్యాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో షారుఖ్ ఖాన్ కూడా అక్కడే ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో షారుఖ్ కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్