Fire On Bigg Boss Set: బిగ్ బాస్ సెట్‌లో అగ్ని ప్రమాదం.. 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

Published : Feb 13, 2022, 03:18 PM ISTUpdated : Feb 13, 2022, 03:19 PM IST
Fire On Bigg Boss Set: బిగ్ బాస్ సెట్‌లో అగ్ని ప్రమాదం.. 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

సారాంశం

బిగ్ బాస్ రియాలిటీ షో‌కు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సల్మాన్‌ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ 15 ఇటీవల ముగిసిన సంగతి తెలిసింది. అయితే ఆదివారం Bigg Boss 15 sets‌లో మంటలు చెలరేగాయి. 

బిగ్ బాస్ రియాలిటీ షో‌కు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సల్మాన్‌ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ 15 ఇటీవల ముగిసిన సంగతి తెలిసింది. అయితే ఆదివారం Bigg Boss 15 sets‌లో మంటలు చెలరేగాయి. ఈ సెట్ ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఉంది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాప యంత్రాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్‌లో నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. 

అయితే సెట్‌లోని ఏ భాగంలో మంటలు చెలరేగాయి అనే విషయంపై తెలియలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విజేతగా టీవీ నటి తేజస్వి ప్రకాష్‌ నిలిచారు. ప్రతీక్‌ సెహజ్‌ పాల్‌- తేజస్విని మధ్య సాగిన టైటిల్‌ రేసులో చివరికి  తేజస్విని ప్రకాశ్‌ బిగ్ బాస్ ట్రోఫిని సొంతం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం