ఫైనల్ గా ఓటేసేందుకు వచ్చిన దర్శకేంద్రుడు!

Published : Dec 07, 2018, 01:55 PM IST
ఫైనల్ గా ఓటేసేందుకు వచ్చిన దర్శకేంద్రుడు!

సారాంశం

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఎట్టకేలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు ఉదయం ఆయన పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి అసంతృప్తితో వెనుతిరిగిన సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఎట్టకేలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు ఉదయం ఆయన పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి అసంతృప్తితో వెనుతిరిగిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫిల్మ్ నగర్ బూత్ వద్ద లైన్ పెద్దగా ఉండడంతో ఆయన మొదట క్యూని పట్టించుకోలేదు. 

ఉదయం డైరెక్ట్ గా ఓటు వేయడానికి లోపలి వెళుతుండడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా రాఘవేంద్ర రావు సైలెంట్ గా వెనుదిరిగి వెళ్లారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన క్యూలోనే వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా ప్రముఖులందరూ సాధారణ జనాలతో కలిసి లైన్ లో వచ్చి ఓటు వేశారు. 

ఎక్కువ సేపు అల్లు అర్జున్ లైన్ లో నిలబడగా ఇతర సినీ ప్రముఖులు ఉదయం జనం తక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా ఓటు వేసి వెళ్లిపోయారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్