ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతుంటాను... కొడుకుల విభేదాలపై ఎట్టకేలకు బయటపడ్డ మోహన్ బాబు!

Published : Mar 31, 2023, 02:47 PM ISTUpdated : Mar 31, 2023, 03:17 PM IST
ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతుంటాను... కొడుకుల విభేదాలపై ఎట్టకేలకు బయటపడ్డ మోహన్ బాబు!

సారాంశం

గత వారం రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు మేటర్ హాట్ టాపిక్ గా ఉంది. దీనిపై మోహన్ బాబు ఎట్టకేలకు స్పందించారు.   

నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుందనేది అతిపెద్ద ససెన్సు. పుకార్లుగా మొదలైన విబేధాల వ్యవహారానికి చిన్న కొడుకు మనోజ్ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చారు. అన్నయ్య విష్ణు తనతో గొడవపడుతున్న వీడియో నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడని ఆరోపణలు చేశాడు. మనోజ్ ఆ వీడియోని వెంటనే డిలీట్ చేశారు. అప్పటికే  వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దాదాపు ఆరు నెలలుగా మంచు ఫ్యామిలీలో గొడవలంటూ వార్తలు వస్తున్నాయి. 

ఈ పుకార్లను బలపరుస్తూ మనోజ్ పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నాడు. మోహన్ బాబు చివరి నిమిషంలో చుట్టపు చూపుగా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ వీడియో నిజమే.. గొడవలు తారాస్థాయికి చేరాయని అందరూ భావించారు. అనూహ్యంగా మార్చి 30 సాయంత్రం విష్ణు ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'హౌస్ ఆఫ్ మంచూస్' అనే రియాలిటీ షో స్టార్ట్ చేయబోతున్నాము. దాని ప్రమోషన్లో భాగంగా గొడవలు పడ్డట్లు ఫ్రాంక్ చేశామని... పరోక్షంగా స్పష్టత ఇచ్చాడు. 

అయితే తండ్రి మోహన్ బాబు వర్షన్ వేరేలా ఉంది. ఆయన మాటలు పరిశీలిస్తే గొడవలు నిజమే, నేను చాలా బాధపడ్డానని ఇండైరెక్ట్ గా  చెప్పినట్టుంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబును విష్ణు-మనోజ్ ల గొడవ గురించి అడగ్గా...  మహాభారతం గమనిస్తే అన్నదమ్ముల మధ్య ఏర్పడిన చిన్న చిన్న మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా మారాయి. చివరికి అన్నీ కోల్పోయారు. గొడవల వలన ఏం వస్తుంది చెప్పండి. మానసిక ప్రశాంత కోల్పోతాము. 

ఆనందాలు దూరమవుతాయి. కొన్నిసార్లు నేను ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతుంటాను. అలా జరిగి ఉండకపోతే బాగుండు కదా అనుకుంటాను. మనుషుల మధ్య ఆవేశాలు, కోపాలు చోటు చేసుకుంటాయి. అవి రావని కాదు. ఎందుకు వస్తాయంటే చెప్పలేము... అని అన్నారు. విష్ణు, మనోజ్ మధ్య వివాదం చోటు చేసుకుందని నేరుగా ఆయన చెప్పలేదు. మాటలు గమనిస్తే నిజమనిపిస్తుంది. ఆయన ఇంకా మాట్లాడుతూ... శ్రీవిద్యా నికేతన్ యూనివర్సిటీగా ఎదగడంలో విష్ణు ఎంతగానో కృషి చేశాడు. అందుకే ఆ విద్యాసంస్థ బాధ్యతలు తనకు అప్పగించానని అన్నారు. 

మోహన్ బాబు ఫ్యామిలీకి శ్రీవిద్యా నికేతన్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. బహుశా దానిపై ఆధిపత్యం విషయంలో విష్ణు, మనోజ్ కి గొడవలు జరిగి ఉండవచ్చు. మోహన్ బాబు ఏకపక్షంగా విష్ణుకు శ్రీవిద్యా నికేతన్ మీద అధికారం కట్టబెట్టడం విబేధాలకు దారితీసి ఉండొచ్చని టాలీవుడ్ వర్గాల అంచనా... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్‌ని కాదు, త్రిష ఉదయనిధిని ప్రేమిస్తోంది, రమ్యకృష్ణ అంటే ఆమెకిష్టం.. సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు
Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?