యాక్సిడెంట్ లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతి,సుదీప్ సంతాపం

Published : Jul 16, 2019, 08:12 AM IST
యాక్సిడెంట్ లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతి,సుదీప్ సంతాపం

సారాంశం

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు. 

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు. నిన్న సోమవారం  సాయింత్రం ఏడున్నర లక్షలు చేసే తన కొత్త బైక్ సుజికి వో స్ట్రోమ్  650 XT పై బయిలు దేరారు. ఇంటినుంచి బయిలుదేరి బయిటకు వెళ్లిన ఆయన బైక్ ని స్పీడుగా నడిపారు. కాసేపటికి ఆయన కంట్రోలు తప్పి ఓ కాంపౌండ్ వాల్ కు గుద్దుకుంది.  దాంతో స్పాట్ లోనే ఆయన మరణించారు. ఇదంతా బెంగుళూరు వసంత్ నగర్ లోజరిగింది. 

స్పీడుగా వచ్చి మలుపు తిప్పుతూండగా, స్ట్రీట్ లైట్స్ లేకపోవటంతో చాలా చీకటిగా ఉండటంతో మలుపు దగ్గర వాల్ ని గుద్దేసి ఉంటారని పోలీస్ లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపట్లోనే దగ్గరలో ఉన్న జైన్ హాస్పటిల్ కు తీసుకు వెళ్లినా ఫలితం లేదు.  పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయటంతో  కన్నడ ఇండస్ట్రీలో అజయ్ కు మంచి పేరుంది. అజయ్ తండ్రి కన్నడ పరిశ్రమలో హిందీ సినిమాలకు పేరున్న డిస్ట్రిబ్యూటర్. 

దాంతో సుదీప్ తో సహా మరికొందరు హీరోలు తమ సంతాపం సోషల్ మీడియాలో  తెలియచేసారు. తెలుగులో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నారు. ఈ వార్త విన్న కొందరు తెలుగు నిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేసారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?