ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు.. వాగ్వాదానికి దిగిన నిర్మాతలు!

By AN TeluguFirst Published Jul 27, 2019, 3:46 PM IST
Highlights

ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోన్న సమయంలో నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. దాదాపు 1438 మంది సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ జరుగుతుండగా.. ఒకానొక దశలో పరిస్థితులు నిర్మాతల మధ్య గొడవకి దారి తీశాయి. 

ఇరు వర్గాల సభ్యులు వాదించుకావడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ప్రసన్న కుమార్, నట్టి కుమార్ వంటి వారు కలుగజేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సారి పోటీ ప్రధానంగా 'మన ప్యానెల్', 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్' మధ్యే ఉంది.

'మన ప్యానెల్‌'నుంచి తుమ్మల ప్రసన్నకుమార్‌, వై.వి.ఎస్‌.చౌదరి, పల్లి కేశవరావు, నట్టి కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, ఎం. శివకుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జె.పుల్లారావు, వి.సాగర్‌, డి.రమేశ్‌బాబు, సి.ఎన్‌.రావు తదితరులు పోటీ చేస్తున్నారు.

యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తరఫున దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, కొర్రపాటి సాయి, వై. రవిశంకర్‌, శివలెంక కృష్ణ ప్రసాద్‌, భోగవల్లి ప్రసాద్‌, దామోదరప్రసాద్‌, ఆచంట గోపీనాథ్‌,  సూర్యదేవర నాగవంశీ, బెక్కెం వేణుగోపాల్‌, కె.కె. రాధామోహన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రమే ఎన్నికల  ఫలితాలు వెల్లడికానున్నాయి. 

click me!