విజయ్ దేవరకొండ 'కామ్రేడ్' కి కష్టాలు!

By AN TeluguFirst Published Jul 27, 2019, 1:26 PM IST
Highlights

తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన 'డియర్ కామ్రేడ్' సినిమాకు సాండల్‌వుడ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకలో కన్నడ వర్షన్‌ కన్నా తెలుగు వర్షన్‌కే ఎక్కువగా థియేటర్లు కేటాయించటంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. అయితే కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కే ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమపై తెలుగు భాషను రుద్దుతున్నారంటూ 'బాయ్కాట్ డియర్ కామ్రేడ్' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

కర్ణాటకలోని ప్రధాన నగరాలలో కూడా డియర్ కామ్రేడ్ కన్నడ వెర్షన్ కి పెద్దగా థియేటర్లు దక్కపోవడంతో ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందు కర్ణాటకలో సినిమాను బాగా ప్రమోట్ చేశారు. సినిమా ఈవెంట్ కి కేజీఎఫ్ హీరో యష్ హాజరు కావడంతో కర్ణాటకలో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. రష్మిక కన్నడ అమ్మాయి కావడంతో జనాలకు సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది.

కానీ కర్ణాటకలో తెలుగు డామినేషన్ ఎక్కువైందంటూ అక్కడి వారు ఫీల్ అవుతుండడం ఇప్పుడు కామ్రేడ్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా నేరేషన్ స్లోగా ఉందని, నిడివి ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడం, విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా జనాలు థియేటర్ కి పరుగులు తీస్తున్నారు. తొలిరోజే ఈ సినిమా పదకొండు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్ కాబట్టి కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. 

click me!