సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాం: ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్!

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 12:57 PM IST
Highlights

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు పని చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు వెల్లడించారు

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు పని చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు వెల్లడించారు.

ఇటీవల మీడియా ముందుకు వచ్చిన వారు 1100 సినిమాలకు పైగా పనిచేశామని తమకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయని అన్నారు. దాదాపు తెలుగు హీరోలందరికీ ఫైట్ మాస్టర్స్ గా పని చేసిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం మహేష్ బాబు, చిరు 151వ సినిమాకు పని చేస్తున్నట్లు వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో తమకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయాన్ని వెల్లడిస్తూ.. త్వరలోనే తాము సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు. సినిమాలకు దూరమై పల్లెటూరి వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ ఇంటిని నిర్మించుకొని ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST