‘బేబీ’ మూవీ ప్రొడ్యూసర్ SKN, జర్నలిస్టుల మధ్య గొడవ జరిగింది. మీడియా వ్యక్తులపై నిర్మాత దాడి చేశారంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది.
కొద్దిరోజులుగా ‘బేబీ’ మూవీ నిర్మాత SKN సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన Baby Movie భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఈయన ఏ వేదికపై మాట్లాడిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ‘బేబీ’ సినిమాకు సోషల్ మీడియాతో పాటు మీడియా విలేకర్లు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరుకోవాలని ఆశించారు. అందుకు తమవంతుగా చేయాల్సింది చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ప్రొడ్యూసర్ SKN, విలేకర్ల మధ్య గొడవ జరిగింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి బేబీ టీమ్ వెళ్లింది. అక్కడ ‘బేబీ’ టీమ్ చేసిన అత్యుత్సాహమే వివాదానికి కారణమని తెలుస్తోంది. ఏకంగా మీడియాపైనే దాడి చేశారంటూ కూడా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు గాయపడ్డట్టు తెలుస్తోంది. బౌన్సర్లతో మరీ దాడి చేశారని అంటున్నారు. వీడియోలో ఎస్కేఎన్ మీడియా వారితో మాట్లాడుతున్న తీరు నెట్టింట వైరల్ గా మారింది.
undefined
ఘటనతో భీమవరంలోనే విలేకర్లు SKN కారును అడ్డగించారు. మీడియా వాళ్లను కొట్టే రైట్ ఎవరికీ లేదంటూ కూడా జర్నలిస్టులు నిలదీశారు. సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక వీడియో చివర్లో నిర్మాత ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ వివాదానికి అసలు కారణం ఏంటనేది తెలియరాలేదు. కవరేజీకి వచ్చిన మీడియాపై ‘బేబీ’ యూనిట్ బౌన్సర్లు అత్సుత్సాహమే కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
‘బేబీ’ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. విజయ్ అవ్విన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (SKN) నిర్మించారు. ఈయన నిర్మాతగా గతంలో ‘టాక్సీవాలా’ వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం వచ్చిన ‘బేబీ’ మాత్రం ఆడియెన్స్ ను మెప్పించింది. మరోవైపు బాక్పాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 14న విడుదలైన ఈ చిత్రం 18 రోజుల్లోనే రూ.80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందా? అన్నది చూడాలి.