ఐటెం సాంగ్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ లకి మధ్య విబేధాలు!

Published : Aug 06, 2019, 03:39 PM ISTUpdated : Aug 06, 2019, 03:46 PM IST
ఐటెం సాంగ్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ లకి మధ్య విబేధాలు!

సారాంశం

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల మధ్య విబేధాలు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్. 

ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. కానీ బన్నీకి మాత్రం ఐటెం సాంగ్ పెట్టడం అసలు ఇష్టం లేదని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ లేవు. 'జులాయి' సినిమాలో ఉదయభాను ఐటెం సాంగ్ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ సినిమాలో ఐటెం సాంగ్ లేదు.

ఇప్పుడు మరోసారి బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఐటెం సాంగ్ అంశం తెర మీదకి వచ్చింది. సినిమాలో ఓ కీలక సందర్భంలో ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండాలని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నారట. కానీ ఇలాంటి కథలో ఐటెం సాంగ్ ఉంటే బాగోదని బన్నీ ఫీల్ అవుతున్నాడట. ఈ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి. 

గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?