వరల్డ్ కప్ గురించి బిగ్ బి అమితాబ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సరదాగా మారింది. టీమిండియా సెమీ ఫైనల్ లో విజయం సాధించడం పై అమితాబ్ ట్వీట్ చేస్తూ నేను చూడకపోతే ఇండియా విజయం సాధించింది అని పేర్కొన్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ లో విజయం సాధించింది. ఫలితంగా టీమిండియా నాల్గవసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఆదివారం రోజు జరగబోయే వరల్డ్ కప్ గ్రాండ్ ఫైనల్ పై అంచనాలు పెరిగిపోయాయి.
టీమిండియా విజయం సాధించాలని దేశం నలువైపులా ఫ్యాన్స్ అభిమానులు ప్రార్థనలు మొదలు పెట్టారు. ఇండియాలో సెంటిమెంట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2003లో ఈ రెండు జట్లే వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడ్డాయి. అప్పుడు ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ సరి టీమిండియా తప్పకుండా రివేంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
undefined
అయితే వరల్డ్ కప్ గురించి బిగ్ బి అమితాబ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సరదాగా మారింది. టీమిండియా సెమీ ఫైనల్ లో విజయం సాధించడం పై అమితాబ్ ట్వీట్ చేస్తూ నేను చూడకపోతే ఇండియా విజయం సాధించింది అని పేర్కొన్నారు.
T 4831 - when i don't watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan)దీనితో సెంటిమెంట్లు బాగా ఫాలో అయ్యే ఇండియన్ ఫ్యాన్స్.. అమితాబ్ ని ఫైనల్ మ్యాచ్ చూడడానికి రావొద్దని రిక్వస్ట్ చేస్తున్నారు. మా కోసం ఈ ఒక్క త్యాగం చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కనుక మ్యాచ్ చూడడానికి వస్తే మేము మిమ్మల్ని బంధిస్తాం అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీనితో అమితాబ్ మరో ట్వీట్ చేశారు. నేను ఇప్పుడు మ్యాచ్ చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని పేర్కొన్నారు.