డైరెక్షన్‌ మానేసి రాజకీయ పార్టీ పెట్టబోతున్న అనిల్‌ రావిపూడి.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

Published : Nov 17, 2023, 03:24 PM IST
డైరెక్షన్‌ మానేసి రాజకీయ పార్టీ పెట్టబోతున్న అనిల్‌ రావిపూడి.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

సారాంశం

దర్శకుడిగా ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలతో మెప్పించిన అనిల్‌ రావిపూడి ఉన్నట్టుండి పెద్ద షాక్‌ ఇచ్చాడు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. డైరెక్షన్‌ మానేసి పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. 

దర్శకుడు అనిల్‌ రావిపూడి.. డైరెక్టర్‌గా వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఆయన బాలకృష్ణతో చేసిన `భగవంత్‌ కేసరి`తో సక్సెస్‌ కొట్టాడు. `పటాస్‌` నుంచి `భగవంత్‌ కేసరి` వరకు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మధ్యలో `ఎఫ్‌3` పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించుకుంది. `భగవంత్‌ కేసరి` సైతం దసరా పండగ కావడంతో గట్టున పడింది. మామూలు రోజుల్లో అయితే బోల్తా కొట్టేది. 

దర్శకుడిగా ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలతో మెప్పించిన అనిల్‌ రావిపూడి ఉన్నట్టుండి పెద్ద షాక్‌ ఇచ్చాడు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. డైరెక్షన్‌ మానేసి పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోని విడుదల చేశారు. ఇన్నాళ్లు దర్శకుడిగా తనని ప్రోత్సహించారని, విజయాలు అందించి సక్సెస్‌ చేశారని, తన సక్సెస్‌కి కారణం మీరే అని తెలిపారు. ఇకపై కొత్త రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్టు, చట్టసభల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిపారు. సినిమాల్లో ఆదరించినట్టే, రాజకీయాల్లోనూ తనని ఎంకరేజ్‌ చేయాలని చెప్పడం విశేషం. 

ఈ వీడియోలో అనిల్‌ రావిపూడి చెబుతూ, `నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్‌ చేశారు. నేను ఎంటర్‌టైన్‌ చేశాను, మీరు ఎంటర్‌టైన్‌ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈ సారి నా గెలుపు థియేటర్లో కాదు, ఓ అసెంబ్లీ, ఓ పార్లమెంట్‌ ఇలా ప్లాన్‌ చేసుకుంటున్నాను. పంపిస్తారుగా, పంపిస్తారు లే. బాక్సాఫీసు సక్సెస్‌ చూసిన నాకు బ్యాలెట్‌ బాక్స్ సక్సెస్‌ చూడాలని ఉంది.అదేనండి మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో,  ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం సమాచారంతో త్వరలో వస్తాను` అని వెల్లడించారు అనిల్‌ రావిపూడి. 

పొలిటికల్‌ లీడర్‌ గెటప్‌లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆయన గెటప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇదంతా ఓ షో కోసం అని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం `ఆహా` ప్లాన్‌ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నెలకొన్న నేపథ్యంలో పొలిటికల్‌ కాన్సెప్ట్ తో ఓ షో చేస్తున్నారని, దానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి యాంకర్‌గా వ్యవహరిస్తారని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రోమోని వదిలారని టాక్. మరి ఇందులో నిజమేంటి? షో కాకుండా మరేం చేయబోతున్నారనేది మున్ముందు తేలనుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?