బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

Published : Sep 29, 2018, 10:51 AM IST
బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

సారాంశం

రేపటితో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుండడంతో హౌస్ లో పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఎపిసోడ్ లో మొదట బిగ్ బాస్ గీతామాధురి జర్నీ గురించి స్పెషల్ వీడియో ప్లే చేసి ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.

రేపటితో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుండడంతో హౌస్ లో పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఎపిసోడ్ లో మొదట బిగ్ బాస్ గీతామాధురి జర్నీ గురించి స్పెషల్ వీడియో ప్లే చేసి ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.

గీతాని ఉద్దేశిస్తూ.. మీ దృడ సంకల్పానికి విశ్వాసానికి అభినందులు తెలుపుతూ మీరు కోరుకునే ఎత్తుకు ఎదగాలన్నారు బిగ్ బాస్. అనంతరం కౌశల్ ని యాక్టివిటీ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ హౌస్ లో ఆయన ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లుగా చూపించారు.

బిగ్ బాస్ కౌశల్ తో మాట్లాడుతూ.. హౌస్ లో అత్యంత దృఢమైన వ్యక్తి మీరు.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మీ ఆలోచన విధానం, గెలవాలనే పిచ్చి పట్టుదల హౌస్ లో ఉన్న చాలా మందికి నచ్చలేదు.. అయినప్పటికీ మీరు వెనుకడుగు వేయలేదు. ధైర్యంతో ముందుకు సాగారు.

ఎదుటివారి బలహీనతలను మీ బలంగా మర్చుకున్నరంటూ కౌశల్ జర్నీపై ఓ వీడియోని ప్లే చేశారు. ఈ వీడియోలో కౌశల్ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను, తన పిల్లలు హౌస్ లోకి వచ్చిన దృశ్యాలను చూపించారు. దీంతో కౌశల్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: తన సక్సెస్ సీక్రెట్ చెప్పిన రష్మిక మందన్నా.. వాళ్లలా చేసి ఉంటే అడ్రస్‌ ఉండేది కాదా?
Varanasi: వారణాసి కలెక్షన్లు, వెయ్యి కాదు, 10000కోట్లు.. రాజమౌళి ప్లాన్‌ ఇదే, ప్రొడ్యూసర్‌ జోస్యం